ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జీవో 118 భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎల్బీనగర్‌లో జీవో 118 పరిధిలో ఉన్న సుమారు 9,500 మంది సమస్యలను త్వరలోనే పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించి హక్కు పత్రాల జారీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. దీంతో పాటు 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం హైపవర్ కమిటీ, యూఎల్‌సీ భూములపై కొత్త విధానం తీసుకువస్తామని వెల్లడించారు.