Revanth Reddy on Kuruma Community: హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన దొడ్డి కొమురయ్య కురమ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఎవరైనా భూములు అమ్మాలనుకుంటే.. కురుమ సోదరులకు అమ్మాలంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. వాళ్లయితేనే.. డబ్బులు నడుముకు కట్టుకుని తీసుకొచ్చి నమ్మకంగా ఇస్తారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదేక్రమంలోనే.. రాష్ట్రంలో కులగణన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.