ఏపీ తీర ప్రాంతంలోకి తమిళనాడు జాలర్ల చొరబాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీ జాలర్లు, తమిళనాడు ప్రాంతంలోకి వెళ్లరని.. అలాగే అక్కడి వారు ఇక్కడికి వచ్చి ఉద్రిక్తతలకు కారణం కావొద్దని సూచించారు. అలా కాకుండా అక్రమంగా ఎవరైనా ప్రవేశిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో తిరుపతి, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామన్న చంద్రబాబు.. ఎవ్వరి మాట వినొద్దని, ఇది నా ఆదేశమంటూ స్పష్టం చేశారు.