ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకంపై క్లారిటీ వచ్చింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. అయితే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ కొనసాగుతోందని.. పథకంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకం తెచ్చిందే టీడీపీనని స్పష్టం చేశారు.