రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ యువత ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.219 కోట్లతో ఈ-కామర్స్, లాజిస్టిక్స్, సోలార్ రంగాల్లో 10 వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా భారీ సబ్సిడీతో ఈ-వాహనాలు, పశుసంపద యూనిట్లు పంపిణీ చేయనున్నారు. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.40 కోట్లతో 10,500 మంది గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మే 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.