రోడ్డుపై బైక్ నడుపుతూ పెట్రోల్ ట్యాంకుపై ల్యాప్‌టాప్ పెట్టుకుని ఆఫీస్ పనులు చక్కబెడుతున్న ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ప్రమాదకరమైన వర్క్ ఫ్రమ్ బైక్ వెర్రితనంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నప్పటికీ ఇలా ప్రాణాలను పణంగా పెట్టడం బాధ్యతారాహిత్యమని, కడుపు నింపుకోవడానికి చేసే ఉద్యోగం ప్రాణాలు తీసేలా ఉండకూడదని ఆయన హితవు పలికారు.