Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మహా నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున నగరవాసులు తరలివస్తుండగా.. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తానే స్వయంగా ట్యాంక్‌బండ్‌కు వచ్చి.. నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్కడున్న క్రేన్ ఆపరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. ఇలా ఏ సీఎం చేయలేదని పేర్కొన్న రాజాసింగ్.. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.