ఏం తమాషాగా ఉందా.. రైతులు నీ దగ్గరకు రావాలా: మంత్రి నాదెండ్ల ఆగ్రహం

1 month ago 4
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రైతు సేవా కేంద్రం ఉద్యోగులపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. రైతులు కుప్పనూర్చి వారం రోజులు కావస్తున్నా.. ఇంకా ఎందుకు ధాన్యం కొనుగోలు చేయలేదని వారిపై ఫైర్ అయ్యారు. రైతు సేవా కేంద్రం ఉద్యోగులు ఫీల్డ్‌లోనే ఉంటూ రైతులు దగ్గరి నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని సూచించారు. చల్లపల్లి మండలం కొత్త మాజేరులో పొలాల్లో ఆరబోసిన ధాన్యాన్ని నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ధాన్యం బాగున్నాయని.. తేమ కూడా చాలా తక్కువగా ఉందని ఆయన రైతులతో అన్నారు. అయితే, తాము కుప్పనూర్చి నాలుగైదు రోజులు కావస్తున్నా అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు మంత్రితో చెప్పారు. మిల్లర్లు సరైన ధర కూడా ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక రైతు సేవా కేంద్రం సిబ్బంది ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు.
Read Entire Article