అఘోరి నాగసాధు ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. గతకొన్నాళ్లుగా అఘోరి రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శిస్తోంది. హిందూ ధర్మం గురించి, ఆలయాల పరిరక్షణ గురించి కీలక కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులు అఘోరిని ఇంటర్వ్యూలు చేసేందుకు పోటీ పడుతున్నారు. అయితే అఘోరి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.