ఏందయ్యా ఇది.. పగలు రాజకీయం.. రాత్రి గాల్లోకి నిమ్మకాయలు లేపుతూ.. భయాందోళనలో గ్రామస్తులు..

4 months ago 12
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేగింది. మాజీ సర్పంచ్ అభ్యర్థి నారపోగు నాగరాజు.. ఒక మాంత్రికుడి సాయంతో తాంత్రిక పూజలు చేస్తూ అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ పూజల్లో భాగంగా అన్నం రాసులపై మాంసం, రక్త తర్పణాలు చేసి, నిమ్మకాయను గాల్లో లేపిన వీడియో వైరల్ అయింది. డబ్బే ధ్యేయంగా మూఢనమ్మకాలు వ్యాపింపజేస్తున్న నాగరాజుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article