ఏటీఎంలో చోరీ యత్నం.. సీసీ కెమెరాల్లో దొంగ కష్టాలు రికార్డు

1 year ago 37
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఏటీఎం మిషన్‌ను పగులగొట్టడానికి దొంగ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే అలారం మోగడంతో అతని ప్రయత్నం భగ్నమైంది. ఈ ఘటన మంగళవారం (జూన్ 3) తెల్లవారుజామున చోటుచేసుకుంది. తెల్లవారుజామున గుర్తు తెలియని దొంగ హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలోకి ప్రవేశించి.. డబ్బులు కొల్లగొట్టే ఉద్దేశంతో ఏటీఎం మిషన్‌ను పగులగొట్టడానికి నానా తంటాలు పడ్డాడు. మిషన్‌ను పగలగొడుతుండగా అనుకోకుండా ఏటీఎంలో అమర్చిన అలారం మోగింది. అలారం మోగగానే దొంగ కంగుతిని, అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు.
Read Entire Article