తెలంగాణలో గత ఏడాది భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఏకంగా రూ.40 వేల కోట్లకుపైగా మద్యాన్ని మందుబాబులు తాగేశారు. దీంతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదాయంలో సరికొత్త రికార్డును అందుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి రూ.40 వేల కోట్ల మార్కు దాటింది. ఇందులో బీర్ల అమ్మకాలు తగ్గగా.. లిక్కర్ సేల్స్ మాత్రం పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. వైన్స్‌లు, బార్ల టెండర్ల ద్వారా కూడా భారీగానే ఖజానాకు ఆదాయం సమకూరింది. డిసెంబర్ నెలలో అత్యధికంగా రూ.5,051 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.