హైదరాబాద్ శివారు రామచంద్రాపురం పీఎస్ లిమిట్స్‌లో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై 17 ఏళ్ల మైనర్ బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. టీవీ చూద్దామని పిలిచి చిన్నారిపై అత్యాచారం చేశాడు. చిన్నారికి తీవ్ర రక్తస్త్రావం కావటంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.