ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీ గవర్నర్ ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జగన్‌తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకానున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జగన్ అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం.