ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఇరుసభల్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఇందులో ఆయన సీఎం చంద్రబాబు పేరు తప్పుగా చదివారు. దీంతో కాసేపు సభలో సభ్యులు ఆశ్చర్యపోయారు. గవర్నర్ ఇలా సీఎం పేరునే తప్పుగా చదవడంపై పలువురు సభ్యులు చెవులు కొరుక్కోవడం కనిపించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు ప్రసంగించిన గవర్నర్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరును నరేంద్ర చంద్రబాబు నాయుడిగా చదివారు.