ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మోదీ అభిమాని ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ పూల ప్రేమ్ కుమార్ అనే నరేంద్ర మోదీ అభిమాని.. పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై వైఎస్ షర్మిల ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీని, దేశ నిఘా వ్యవస్థలను ఉద్దేశించి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రేమ్ కుమార్ ఫిర్యాదు చేశారు.