ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో అమరావతిలో అదనపు భూసమీకరణకు ఆమోదం లభించింది. అలాగే కొత్తగా మరో 9 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటుగా టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.