Pawan Kalyan Suffered With Viral Fever: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అయినా సరే ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నందున వైద్యుల సూచనలు తీసుకుంటున్నారు.