Hyderabad Bus Bhavan A Block: ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి ఆస్తుల పంచాయితీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ బస్ భవన్ అంశంపై ఇప్పుడు మరో వివాదం మొదలయ్యింది. బస్ భవన్ ఏ బ్లాక్‌ను తెలంగాణ ప్రభుత్వం కమర్షియల్ ట్యాక్స్‌శాఖకు కేటాయించడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎస్ సాయిప్రసాద్.. తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు. అలాగే తెలంగాణ ఆర్టీసీ ఎండీకి కూడా ఫిర్యాదు చేశారు.