SCR Special Trains For Dussehra Deepavali: ఏపీ, తెలంగాణలో రైలు ప్రయాణికులకు శుభవార్త. దసరా, దీపావళి, ఛట్‌పూజలు ఉండటంతో.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఈ ప్రత్యేక రైళ్లను ప్రయాణానికి వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మీదుగా చాలా రైళ్లు ఉన్నాయి. తిరుపతికి కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే.. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.