Visakhapatnam South Coast Railway Zone To Begin From April 1: దక్షిణ కోస్తా జోన్ కార్యకలాపాలకు సంబంధించి కీలక ముందడుగు పడుతోంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న జోన్ కార్యకలపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1న కొత్త రైల్వే జోన్కు అపాయింటెడ్ డేగా ప్రకటించబోతున్నారట. ఈ నెలాఖరుకు ప్రకటన వస్తుందని చెబుతున్నారు.