రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. అయితే, అల్లూరు జిల్లాలో మాత్రం ఓ మండలంలో తీవ్ర వడగాల్పులు ఉటాయని హెచ్చరించింది. ఆ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం కూడా రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.