ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ, నామమాత్రపు స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆస్తి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే రూ.100, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.1000 స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇది రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.