AP Govt Allocates Municipal Sites Lands: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పుర, నగరపాలక సంస్థలలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నివాస, వాణిజ్య అవసరాలకు కేటాయించి ఆదాయం పొందాలని నిర్ణయించారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. మున్సిపల్‌శాఖ ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.