Andhra Pradesh Building Penalization Scheme: ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు లేని భవనాల క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) అమలుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 59,041 అక్రమ నిర్మాణాలు, 9,985 అదనపు అంతస్తులు, 49,056 నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవచ్చు. మరోవైపు, గోదావరి బోర్డు పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ వివరాలను వారం రోజుల్లోగా తెలపాలని ఏపీ జల వనరుల శాఖకు లేఖ రాసింది.