Andhra Pradesh Govt 5% Rebate On Property Tax In Panchayats: ఏపీ ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపంచాయతీల తరహాలో పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను చెల్లింపులపై రాయితీ ప్రకటించారు. పంచాయతీల్లో ఆస్తి పన్ను చెల్లించేవారి 5% రాయితీ తొలిసారి ప్రకటించారు. మే 1 నుంచి 31లోపు పన్ను చెల్లించేవారికి ఈ రాయితీ ఉంటుంది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.