Andhra Pradesh Weather Today Temperatures:ఏపీలో ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2, కడప జిల్లా ఒంటిమిట్టలో 42.1 డిగీ్రల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతరారామరజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 89 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయంటున్నారు. శనివారం 230 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్లుల నిర్వహణ సంస్థ తెలిపింది.