AP Land Survey: ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీసర్వేలో తహసీల్దార్ స్థాయిలో అభ్యంతరాల పరిష్కార గడువును ఏడాది నుంచి రెండేళ్లకు పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ పిటిషన్ల కమిటీ సిఫార్సు చేసింది. విశాఖపట్నంలో ఈ కమిటీ సమావేశం నిర్వహించింది. పలు వినతుల్ని స్వీకరించింది. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని, ఇప్పటికే 7 లక్షల అభ్యంతరాలు రాగా, 2 లక్షల సమస్యలు పరిష్కరించామని సర్వే డైరెక్టర్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నారు.