ఏపీవాసులకు రేపు(గురువారం) శుభవార్త అందనుంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు బిగ్ అన్‌వీల్ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. 2019లో రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టును నిలిపేసిన ఓ సంస్థ.. తుపానులా తిరిగి రానుందంటూ లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో ఏంటా సంస్థ.. ఎంత పెట్టుబడి పెట్టనుంది.. ఎక్కడ పెడుతోందనే దానిపై నెటిజనం చర్చించుకుంటున్నారు. అయితే వీటన్నింటికీ సమాధానాలు రేపు ఉదయం (గురువారం) తెలియనున్నాయి.