Andhra Pradesh E Passport Details: ఆంధ్రప్రదేశ్‌లో ఈ-పాస్‌పోర్టుల జారీ ప్రారంభమైంది. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ పాస్‌పోర్టుల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ ఉంటుంది, దీని ద్వారా వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా, పాస్‌పోర్టుల తనిఖీల్లో ఏపీ పోలీసులు మూడు రోజుల్లోనే పూర్తి చేసి అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ధ్రువపత్రాన్ని అందజేసింది.