రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందించనున్నట్లు మంత్రి తెలిపారు, శనివారం నెల్లూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు, ఈ సందర్భంగానే కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అన్ని సచివాలయాల్లో అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు.