LPG eKYC Deadline August 15 In Andhra Pradesh: కేంద్రం వంట గ్యాస్ రాయితీ దుర్వినియోగం, అక్రమ కనెక్షన్లకు బ్రేక్ వేసేందుకు ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. ఇప్పటికీ చాలామంది ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. అలాంటి వారికి ఈ నెల 15 వరకు ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి పెండింగ్ ఉన్నవారు వెంటనే వివరాలు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే రాయితీలు ఆగిపోతాయి, కనెక్షన్ రద్దయ్యే అవకాశం ఉంది.