AP Govt Plans Insurance Employees Through Banks: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వర్గాలకు సంబంధించిన ఉద్యోగ ఆరోగ్య బీమాపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ బీమా విధానానికి సంబంధించి సాధాసాధ్యాలపై చర్చించారు.. తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యాన్ని కల్పించే బ్యాంకులతో ప్రధానంగా చర్చిస్తున్నారు ప్రభుత్వ అధికారులు.