ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో రేపు తిరుపతిలో జరగాల్సిన సంక్షేమం బహిరంగ సభను వాయిదా వేసింది. భాగస్వామ్య పార్టీలతో చర్చించిన అనంతరం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమి పాలనకు రెండేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా తిరుపతి, విశాఖ, అమరావతిలో సభలు నిర్వహించాలని కూటమి పార్టీలు ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.