సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పశువులకు గోధార్‌తో అనుసంధానం చేసే ఆలోచన చేస్తోంది. ప్రజలకు ఆధార్ కార్డు తరహాలో పశువులకు గోధార్ తేవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా తిరుపతి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. బుధవారం విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కాంక్లేవ్‌కు చంద్రబాబు హాజరు అయ్యారు.