తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పలు ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో న్యాయమైన వాటాను తెలంగాణకు ఇవ్వాలన్నారు.