పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. బ్లాక్ బర్లీ పొగాకును రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన పొగాకుకు గానూ రైతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పొగాకు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.273 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా పేర్కొన్నారు.