అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ అందించి. వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని తెలిపింది. అన్ని నియోజకవర్గాలలోని బీసీ, ఈబీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ అందించి కుట్టు మిషన్లు అందించనున్నారు. మొత్తం 1.02 లక్షల మంది మహిళలను ఇందుకోసం అధికారులు ఎంపిక చేయనున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన 46,044 మంది మహిళలు, ఈబీసీ వర్గానికి చెందిన 45,772 మంది, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మంది మహిళలను అధికారులు ఎంపిక చేయనున్నారు.