AP Secretariats Name To Change As Welfare Office: ఆంధ్ర ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్ధలో పలు కీలక మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బందిని ప్రక్షాళన చేస్తూనే ఎక్కువ ఉన్నవారిని ఇతర శాఖల్లో బదిలీ చేసేందుకు చూస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు మరికొన్ని మార్పులకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30 లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి అక్టోబర్ 2 నుండి గ్రామ సంక్షేమ కార్యాలయం నుంచి ఇప్పుడు పని చేస్తున్న ఐదు మంది ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.