Sri City Industries Rs 1 Crore Donation: తిరుపతి సమీపంలో శ్రీసిటీ పరిశ్రమలు రూ.కోటి విరాళాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తిరుపతి జిల్లా విపత్తు సహాయ నిధికి అందించాయి. ప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సమక్షంలో శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఈ విరాళం చెక్కును జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్‌కు అందజేశారు. శ్రీసిటీ, పరిశ్రమల భాగస్వామ్య సమష్టి కృషిని యువరాజ్ ప్రశంసించారు. శ్రీసిటీలోని ప్రముఖ జపనీస్ పరిశ్రమ టీహెచ్‌కే ఇండియా రూ.29 లక్షల విలువైన అంబులెన్స్‌ను శ్రీసిటీలోని ఇండస్ట్రీయల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐఏఎల్‌ఏ)కి విరాళంగా ఇచ్చింది.