Guttikonda Srinivas Donated One Crore: ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్ఆర్ఐ గుత్తికొండ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్ధం రూ.కోటి విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి చెక్కును అందజేశారు. గుత్తికొండ శ్రీనివాస్ గతంలో కూడా ఎన్నో విరాళాలు అందించారు. కాణిపాకం వినాయకుడి ఆలయం, హుద్ హుద్, తిత్లి తుఫానుల వంటి కష్ట సమయంలో కూడా భారీగా విరాళాలు అందజేశారు. శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.