ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళన దిశగా ఛైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ నేతల సిఫార్సు మేరకు నిబంధనలకు విరుద్ధంగా వీరిని నియమించారన్న జీవీ రెడ్డి.. లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరనున్నట్లు చెప్పారు. ఆఫర్ లెటర్లు, అపాయింట్‌మెంట్ లెటర్లు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారని.. ఉద్యోగాలు ఇక్కడ.. ఉద్యోగులు ఎక్కడో అనేట్టుగా వ్యవహారం నడిచిందని జీవీ రెడ్డి ఆరోపించారు.