AP Minister Sandhya Rani Former PA Suicide Attempt: ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాజీ పీఏ సతీష్ ఆత్యహత్యాయత్నం చేశారు. సాలూరు సమీపంలోని ఓ తోటలో నిద్రమాత్రలు మింగి.. వాట్సాప్‌లో ఓ మేసేజ్ పెట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆయన్ను సాలూరులోని ఆసుపత్రికి తరలించారు. కొంతమంది వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్‌లో సతీష్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.