Andhra Pradesh Liquor Bottles Mrp: ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అక్రమాలను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించింది.. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే రూ. 5 లక్షలు జరిమానా విధిస్తారు. మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తారు. మద్యం షాపులో పరిధిలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. దీంతో ప్రతి మద్యం షాపు దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేశారు.