హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పంజా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు చోట్ల కూల్చివేతలు చేపట్టిన హైడ్రా.. నేడు కూడా పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపడుతోంది. ఈ నేపత్యంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంటికి కూడా నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.