రాష్ట్రంలోని రైతులకు బిగ్ రిలీఫ్.. ఈ క్రాప్ నమోదు గడువును ఏపీ ప్రభుత్వం రెండోసారి పొడిగించింది. ఇప్పటికే ఈ గడువును ఒకసారి పెంచిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నవంబర్ 12 వరకూ ఈ క్రాప్ నమోదుకు సమయం ఉంది. అయితే నవంబర్ 8 లోగానే పూర్తి చేయాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 9 నుంచి 12 వ తేదీ వరకూ జాబితాను రైతు సేవా కేంద్రాలలో ప్రదర్శిస్తారు. ఏవైనా వినతులు ఉంటే పరిష్కరించి.. నవంబర్ 13న తుది జాబితాను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.