ఏపీ రైతులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సోమవారం ( నవంబర్ 3) నుంచి ప్రారంభం కానుంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరపనున్నారు. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోపే ధాన్యం సొమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమచేసేందుకు చర్యలు చేపట్టారు.