రాష్ట్రంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక వ్యవసాయ అనుబంధ రంగాల కోసం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెటారు. రూ.48,341.14 కోట్లతో అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల కోసం ఓ పథకాన్ని తిరిగి అమలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు. వైసీపీ హయాంలో నిలిపివేసిన రైతులకు రాయితీపై సూక్ష్మపోషకాల పంపిణీతిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు.