ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక కొనుగోలు చేసిన రెండ్రోజుల్లోనే రైతుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు జమచేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం గన్ని బ్యాగులు, లారీలను సైతం సిద్ధం చేసినట్లు వివరించారు. ఇక ప్రతి వాహనాన్ని జీపీఎస్ ద్వారా అనుసంధానం చేశామన్నారు.