Annadata Sukhibhava Scheme Update: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే కేబినెట్ భేటీలో రైతులకు సంబంధించిన పథకం అమలుపై ప్రధానంగా చర్చించారు. ఈ మేరకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఎం కిసాన్‌కు కేంద్రం డబ్బులు విడుదల చేసినప్పుడు.. ఇటు రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు కలిపి రూ.20వేలు ఇవ్వాలని నిర్ణయించారు.